రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పల్లెల్లో ప్రవహిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు స్థానిక ఎస్సై డి.సుధాకర్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డ్రగ్స్ మద్యం ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో పాటు అనారోగ్యాల బారిన పడతారని సూచించారు.
యువత మత్తు సేవించి కొన్ని సందర్భాల్లో జైలు పాలు అవుతున్నారని మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతున్నారని వారికి పరీక్షలు చేయడానికి అనేక పరికరాలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని గ్రామాల్లో గంజాయి వంటి మాదకద్రవ్యాలు సాగు చేస్తున్నట్లుగాని,రవాణా చేస్తున్నట్లుగాని, సేవిస్తున్నట్లుగాని, విక్రయిస్తున్నట్లుగాని తెలిస్తే పోలీసువారికి ఈ నెంబర్ కి 8712656392 తెలియజేయాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై డి సుధాకర్, డాగ్ స్క్వాడ్ పోలీసులు,కార్తీక్, అబ్బాస్, నరేందర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.