పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు.అయితే ఈయన సినిమా ఇండస్ట్రీ వచ్చిన మొదట్లో వరుస సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత మధ్యలో కొద్ది వరకు తడబడ్డాడు అయినప్పటికీ ఆ తర్వాత స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడుఇక ఇలాంటి క్రమంలోని ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లడం జనసేన పార్టీని స్థాపించడం ఆ పార్టీ తరపున ప్రచారం చేసి ఓటములను ఎదుర్కొని ఫైనల్ గా గెలిచి చూపించాడు.
అయితే డిప్యూటీ సీఎంగా( Deputy CM ) పదవి బాధ్యతలను స్వీకరించి పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా తిరుగుతున్నప్పుడు తనకోసం సినిమాలను సెలెక్ట్ చేసి తనకు అనుకూలంగా సినిమా స్క్రిప్ట్ ని మార్చి ఆయన చేత సినిమాలు చేసి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోనేలా చేసి తన పార్టీ ఫండ్ కోసం ఆ డబ్బును ఉపయోగించుకునేలా చేసిన ఒకే ఒక వ్యక్తి మాత్రం త్రివిక్రమ్( Trivikram )… ఈ విషయాన్ని చాలాసార్లు పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశాడు.నిజానికి పవన్ కళ్యాణ్ కోసం కేటాయించే టైం లో త్రివిక్రమ్ చాలా సినిమా స్క్రిప్ట్ లను రాసుకొని వేరే వాళ్ళకి ఇవ్వొచ్చు లేదా తనే డైరెక్షన్ చేయొచ్చు.
అయినప్పటికీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూసుకోకుండా పవన్ కళ్యాణ్ అనే ఒక ఫ్రెండ్ కోసం తను అహర్నిశలు కష్టపడి వర్క్ చేసినందుకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి తన కష్టానికి కూడా ప్రతిఫలం అయితే దక్కింది.ఇక పవన్ కళ్యాణ్ వల్ల త్రివిక్రమ్ అటు ఫైనాన్షియల్ గా ఇటు కెరియర్ పరంగా రెండింటిలో కూడా చాలా వరకు నష్టపయాడనే చెప్పాలి…