తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం చేయడానికి రెడీగా ఉన్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు అతని ఫాన్స్ లో వ్యక్తమవుతున్నాయి.ఇక ఇప్పటికే తను ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి తను చాలా బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరమైతే ఉంది.
మరి ఇలాంటి సమయంలో తను మళ్ళీ సినిమాల వైపు వస్తాడా లేదా అనే అనుమానాలు అయితే ప్రతి ప్రేక్షకుడిలో ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొద్ది రోజులు పాటు బ్రేక్ ఇవ్వలనుకుంటున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత అయితే తన మీద ఉంది.ఇక అలాగే తను రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకపాత్ర వహించబోతున్నాడు కాబట్టి దాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించాల్సిన సమయం అయితే వచ్చింది.
ఇక ఇలాంటి సమయంలో తను సినిమాలా వైపుకు వస్తే పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేడేమో అనే ఉద్దేశ్యం తోనే తను ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి తను ఇక మీదట సినిమాలు చేస్తాడా లేదంటే సినిమాలకు బ్రేక్ ఇచ్చి మొత్తం పాలిటిక్స్ లోనే కొనసాగుతాడా అనేది… ఇక తను పాలిటిక్స్ ( Politics )లో మాత్రమే కొనసాగితే ఆయన అభిమానులు మాత్రం చాలా వరకు నిరాశ చెందే అవకాశం అయితే ఉంది.ఇక ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతారు కాబట్టి వాళ్ళందరూ బాధపడే అవకాశం అయితే ఉంది…
.