ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki) సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరో గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్(prabhas) ఒక భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం పాన్ ఇండియాలో ప్రభాస్ (Pan India prabhas)నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాను నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తగా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా క్లాస్ గా ఉండబోతుందట.ఇక సెకండ్ హాఫ్ కి సంబంధించిన సెటప్ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్ లోనే చేసుకొని సెకండ్ హాఫ్ లో దానికి సంబంధించిన పే ఆఫ్ ను ఇవ్వబోతున్నారు అనే సమాచారం కూడా వస్తుంది.ఇక చాలా మాస్ గా సెకండ్ హాఫ్ ను తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ప్రభాస్ మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ప్రేక్షకులందరి మన్ననలు పొందుతాడు అంటూ నాగ్ అశ్విన్ కామెంట్లైతే చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక విలన్ గా చేసిన కమలహాసన్ కూడా సూపర్ గా నటించాడని, అశ్వద్ధామ గా చేస్తున్న అమితాబచ్చన్ కూడా తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో అటు ప్రభాస్, ఇటు నాగ్ అశ్విన్ ఇద్దరూ కలిసి భారీ హిట్ కొట్టి పాన్ ఇండియాలో 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడతారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…
.