అవిసె గింజలు.( Flax Seeds ) ఇంగ్లీషులో వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని పిలుస్తారు.
చూడడానికి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ అవిసె గింజల్లో పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.ప్రోటీన్, ఫైబర్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి6, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో సహా ఎన్నో పోషక విలువలను మనం ఆవిసె గింజల ద్వారా పొందవచ్చు.
ఆరోగ్యపరంగా ఈ గింజలు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా మధుమేహం( Diabetes ) ఉన్నవారికి అవిసె గింజలు ఒక వరం అని చెప్పుకోవచ్చు.
సాధారణంగా మధుమేహం రోగుల్లో చక్కెర స్థాయి 200 దాటిందంటే చాలా ప్రమాదకరం.అధిక చక్కెర స్థాయి శరీర అవయవాలను దెబ్బతీస్తుంది.గుండె జబ్బులు, స్ట్రోక్ తో పాటు మూత్రపిండాలు, కళ్ళు, చిగుళ్ళు, పాదాలు మరియు నరాల సమస్యలకు దారితీస్తుంది.అందువల్ల షుగర్ లెవల్స్ ను( Sugar Levels ) కంట్రోల్ లో ఉంచుకోవడం ఎంతో అవసరం.
అయితే అందుకు అందుకు అవిసె గింజలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.
రోజు ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేసి సేవించాలి.ఈ విధంగా ప్రతి రోజు కనుక చేస్తూ షుగర్ 400 ఉన్నా కూడా దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అవిసె గింజలు రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది మరియు ఇన్సులిన్ నిరోధకతను నిరోధిస్తుంది.
అందువల్ల మధుమేహం ఉన్నవారికి ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే పైన చెప్పిన విధంగా నిత్యం అవిసె గింజలను తీసుకుంటే.అందులో ఉండే ఫైబర్, ప్రొటీన్లు కారణంగా అతి ఆకలి దూరం అవుతుంది.జీవక్రియ రేటు పెరుగుతుంది.
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు.అంతేకాదు, అవిసె గింజలను తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.