యాదాద్రి భువనగిరి జిల్లా:ఓ మహిళ తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో( Yadadri Bhuvanagiri ) పలువురికి ఆదర్శంగా నిలిచింది.వివరాల్లోకి వెళితే…ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 6 వ,వార్డు బహద్దూరుపేట మాజీ సర్పంచ్ జంపాల ధశరథ భార్య సుజాత (38)( Sujata ) రెండు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురైంది.
చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ లోని యశోద ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ సుజాత మంగళవారం ఉదయం మృతి చెందింది.
ఆమె మరణం వృథా కాకుండా ఉండేందుకు భర్త దశరథ, కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు అంగీకారం తెలిపారు.
దీనితో ఆమె అవయవాల మార్పిడితో మరో ఆరుగురికి ప్రాణం పోశారు.
సుజాత మృతి పట్ల ప్రభుత్య విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత,బూడిద భిక్షమయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ వి.శంకరయ్య,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు గ్రామంలో జరిగిన ఆమె అంతిమయాత్రలో పాల్గొని ప్రగాఢ సంతాపం తెలిపారు.