యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ పట్టణంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నుండి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాలని ట్రాఫిక్ సీఐ విజయమోహన్ కు మంగళవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెమోరడం అందజేశారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ మాట్లాడుతూ వలిగొండ ఎక్స్ రోడ్డు,తంగడపల్లి చౌరస్తా, చౌటుప్పల్ బస్ స్టాండ్ సర్కిల్లో ఇరువైపులా ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేయాలని,ఈ ప్రాంతంలోని సర్కిల్లో జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
పండుగ సమయాలలో అదనపు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నుండి ప్రజలను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి.
ఖయ్యుమ్,నాయకులు రత్నం శ్రీకాంత్,పల్లె శివకుమార్, నేరడి మహేష్,ఖాసీం పాల్గొన్నారు.







