సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కనకేశ్వర శర్మ,పుల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళ్తుండగా డిసిఎం వాహనం ఢీ కొట్టడంతో కనకేశ్వర శర్మ స్పాట్ లో మృతి చెందగా పుల్లయ్యకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







