చుండ్రును తరిమికొట్టే కర్పూరం.. ఇలా వాడితే మరెన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

చుండ్రు.( Dandruff ) స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.చుండ్రు అనేది చిన్న సమస్య అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.చుండ్రు కారణంగా తలలో దురద విపరీతంగా వస్తుంటుంది.

 How To Get Rid Of Dandruff With Camphor Details! Camphor, Camphor Benefits, Late-TeluguStop.com

అంతేకాదు చుండ్రు వల్ల జుట్టు రాలడం( Hairfall ) పెరుగుతుంది.కురులు డ్రై గా కూడా మారుతుంటాయి.

అందుకే చుండ్రు సమస్యను నివారించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే చుండ్రు ని తరిమి కొట్టడానికి కర్పూరం( Camphor ) అద్భుతంగా సహాయపడుతుంది.

కర్పూరం ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే చుండ్రు పరార్ అవ్వడమే కాదు మరెన్నో బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.అందుకోసం ముందుగా నాలుగు లేదా ఐదు కర్పూరం బిల్ల‌లు తీసుకుని మెత్తని పౌడర్ మాదిరి దంచుకుని పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ ఆయిల్ ను ఒక నిమిషం పాటు స్టవ్ పై హీట్ చేయాలి.

హీట్ చేసిన ఆయిల్ లో ముందుగా దంచి పెట్టుకున్న కర్పూరం పొడిని వేసి స్పూన్ సహాయంతో బాగా కలపాలి.

Telugu Camphor, Camphor Oil, Coconut Oil, Dandruff, Care, Care Tips, Fall, Lates

ఇప్పుడు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ కర్పూరం ఆయిల్ ను అప్లై చేసుకుని.మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు అన్న మాటే అనరు.చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే పైన చెప్పిన రెమెడీని పాటిస్తే దెబ్బకు మాయం అవుతుంది.

Telugu Camphor, Camphor Oil, Coconut Oil, Dandruff, Care, Care Tips, Fall, Lates

అంతేకాదు ఈ కర్పూరం ఆయిల్ ను వాడటం వల్ల కుదుళ్ళు దృఢంగా మారతాయి.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.ఈ కర్పూరం ఆయిల్ ను వాడితే ఉన్న జుట్టు మూడింతలు పెరుగుతుంది.తలలో నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారే కాదు ఒత్తైన జుట్టును కావాలని కోరుకునే వారు కూడా తప్పకుండా ఈ కర్పూరం ఆయిల్ ను ఉపయోగించేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube