యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మండలం దాచారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో విగ్రహాలు అపహరణకు గురైన విషయం మంగళవారం గ్రామంలో కలకలం రేపింది.కొంతమంది దుండగులు అర్థరాత్రి దేవాలయంలోకి ప్రవేశించి,విలువైన విగ్రహాలను అపహరించారు.
ఈ ఘటన భక్తులలో భయాందోళనలు కలిగిస్తోంది.దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
చోరీకి పాల్పడిన దుండగులు దేవాలయంలో ఉన్న రాముడు,సీత,లక్ష్మణుడు,రంగనాథ స్వామి దేవతమూర్తుల విగ్రహాలను అపహరించినట్లు పూజారి తెలిపారు.గతంలో కూడా ఇదే దేవాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీ జరిగింది.
ఈ దేవాలయంలో వరుస చోరీలు జరుగుతుండడంతో స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు.భద్రతా ఏర్పాట్లను కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దేవాలయ కమిటీ పూజారి శ్రీనివాస చార్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి,త్వరితగతిన దోషులను పట్టుకోవాలని కోరారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ డి.నాగరాజు తెలిపారు.







