నాకు చనిపోవాలనిపిస్తోంది.. పెళ్లయిన రెండు నెలలకే బర్రెలక్క షాకింగ్ కామెంట్స్?

సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలాంటి వారిలో బర్రెలక్క (Barelakka) ఒకరు.ఈమె యూట్యూబ్ వీడియోలు ఇంస్టాగ్రామ్ రూల్స్ చేస్తూ ఎంతో పాపులర్ అయ్యారు అంతేకాకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరింత పాపులర్ అయ్యారు.

 Barelakka Emotional Comments About Trolls On Her, Barelakka, Negative Trolls,ven-TeluguStop.com

ఇలా ఎన్నికలలో పోటీ చేసి వార్తలలో నిలిచినటువంటి ఈమె ఇటీవల తన స్నేహితుడిని వివాహం చేసుకున్నారు. వెంకటేష్ (Venkatesh) అనే వ్యక్తితో ఘనంగా వివాహం చేసుకొని వార్తలలో నిలిచారు.

Telugu Barelakka, Mp, Trolls, Shirisha, Venkatesh-Movie

ఇలా పెళ్లి తర్వాత కూడా తనకు సంబంధించిన అనేక వీడియోలను ఈమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొనే వారు.అయితే ప్రస్తుతం నేడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎంపీ ఎన్నికలలో(MP Elections) భాగంగా ఈమె మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు.అయితే ఎన్నికలకు ఒక రోజు సమయం ఉందనగా బర్రెలక్క అలియాస్ శిరీష(Shirisha) సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో సంచలనగా మారింది.నాకు చనిపోవాలని ఉంది అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

Telugu Barelakka, Mp, Trolls, Shirisha, Venkatesh-Movie

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నేను మరో గీతాంజలి కాబోతున్నానేమోనని భయంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు.నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారని ఈ విషయం గురించి నన్ను ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారని తెలిపారు.నన్ను కామెంట్లో చేయడం మీకు సరదా కావచ్చు కానీ ఇది ఒకరీ జీవితం ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు.ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత తాను పూర్తిగా రాజకీయాలకు అలాగే సోషల్ మీడియాకు కూడా దూరం అవుతున్నాను.

మీకు నాపై కోపం ఉంటే కొట్టండి కానీ ఇలా నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేయకండి నన్ను చాలా బాధ పెడుతున్నాయి ఈ కామెంట్ల వల్ల నేను చనిపోతానేమో నన్న భయం నాలో కలుగుతుంది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన వీడియో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube