పల్నాడు జిల్లా( Palnadu District ) మాచర్లలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.చంద్రబాబుకు( Chandrababu ) మాట మీద నిలబడిన చరిత్ర లేదన్నారు.
సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని తెలిపారు.చంద్రబాబు హామీలను గమనిస్తే మళ్లీ మోసం చేయబోతున్నారని అర్థం అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ముగింపేనని చెప్పారు.
జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు.59 నెలల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న సీఎం జగన్ 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమచేశామని తెలిపారు.విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వెల్లడించారు.అవ్వాతాతల ఇంటి వద్దకే వెళ్లి రూ.3 వేల పెన్షన్ అందించామన్నారు.గతంలో ఎప్పుడూ చూడని విప్లవాలను వైసీపీ పాలనలో చూశారని తెలిపారు.