అప్పుడు కరెక్టే కానీ ఇప్పుడే..? ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ డ్రామాలు..!!

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని టైటిలింగ్ యాక్టు విషయంలో వైసీపీపై బురద జల్లేందుకు టీడీపీ( TDP ) నానా ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది.

 Right Then But Now Tdp Dramas On Land Titling Act Details, Ap State Politics, Yc-TeluguStop.com

ఎలాగైనా ప్రజలను మెప్పించాలని తాపత్రయపడుతున్నారని తెలుస్తోంది.అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఆ చట్టం రైతులకు చుట్టం.

అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు ఎంతో ధైర్యంగా ఉండొచ్చని చెప్పిన వ్యక్తులే ప్రస్తుతం అది చట్టమే కాదు.పెనుభూతం అంటూ విమర్శానాస్త్రాలు సంధిస్తుండటంపై ఏపీ వ్యాప్తంగా పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) పనికొస్తుందంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేసేస్తామనే స్థాయికి కొందరు నేతలు వచ్చారనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.అంతేకాదు రామాయణం, బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాలను కూడా చదవొద్దని చెప్పడానికి వెనుకాడరని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టీడీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu Ap, Chandra Babu, Cm Jagan, Matter, Tdp Alliance, Tdp Dramas, Ycp-Latest

ల్యాండ్ టైటిలింగ్ చట్టం చాలా మంచిది.యావత్ దేశంలోనే ఇటువంటి చట్టం రానేలేదని టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్( Payyavula Keshav ) అన్నారు.ఇటువంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింతగా ఉండొచ్చన్న ఆయన భూములకు భద్రతని చెప్పారు.

గతంలో అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం పలు దేశాల్లో అమల్లో ఉందని, ఈ కారణంగానే అక్కడ భూతగాదాలు లేవని వివరించారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఈ క్రమంలోనే ఏపీలో కూడా ఇటువంటి చట్టం అమల్లోకి రావాలని డిమాండ్ చేశారు.

అప్పుడు ఆయన వాగ్దాటి, విషయ పరిజ్ఞానం చూసిన సొంత పార్టీ నేతలే పొగడడం విశేషం.

Telugu Ap, Chandra Babu, Cm Jagan, Matter, Tdp Alliance, Tdp Dramas, Ycp-Latest

ఇప్పటివరకు గొప్ప చట్టమంటూ గొప్పలు చెప్పిన టీడీపీ నేతలు, సానుభూతిపరులు ప్రస్తుతం చట్టం పేరిట ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.ప్రత్యేక కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై గంటల వ్యవధి చర్చలు జరుపుతున్నారు.దీన్ని బట్టి చంద్రబాబుకు ఉపయోగ పడేలా ఏ విషయాన్ని అయినా మార్చేందుకు కొందరు ఎటువంటి సిగ్గు, బిడియం లేకుండా ప్రయత్నిస్తారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Ap, Chandra Babu, Cm Jagan, Matter, Tdp Alliance, Tdp Dramas, Ycp-Latest

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeshwari ) సైతం ల్యాండ్ టైటిలింగ్ చట్టం గొప్పతనాన్ని వివరించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం చంద్రబాబు కోసం ఆమె కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం గమనార్హం.ల్యాండ్ టైటిలింగ్ చట్టం యొక్క గొప్పతనంతో పాటు అది ప్రజలకు చేసే మేలు గురించి మూడు పార్టీలు ( బీజేపీ, జనసేన, టీడీపీ) అధినేతలకు తెలుసు.కానీ చంద్రబాబుకు లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశంతో నాలుక మడతేశారని ఏపీ వాసులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏపీలో మరో వారంలో ఎన్నికలు జరగనుండగా.ఈ విధంగా వైసీపీపై టీడీపీ కుట్ర పూరితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పలువురు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని తెలుస్తోంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ పిల్లిమొగ్గలు వేస్తుందంటూ ధ్వజమెత్తుతున్నారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలను మడతేసి కొడితే కూటమికి జేజేమ్మ గుర్తుకు రావడం ఖాయమని తెలుస్తోంది.

అంతేకాదు రానున్న ఎన్నికల్లో ప్రజలే కూటమికి సమాధానం చెప్తారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube