పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ( Parliament Elections )లో భాగంగా అక్రమ డబ్బు,మద్యం, విలువైన వస్తువులు,డ్రగ్స్ లాంటి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా జిల్లా పోలీసు అంతరాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు( Integrated Check posts ) ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ పటిష్టంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్( Suryapet Rural Police Station ) పరిధిలో జాతీయరహదారి 65 హైదరాబాద్- విజయవాడ హైవే పై టేకుమట్ల వద్ద అంతర్ జిల్లా సరిహద్దు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నిర్వహిస్తున్నారు.
డ్రగ్స్ నివారణలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా పోలీసు నార్కోటిక్ డాగ్ రోలెక్స్( Narcotic dog Rolex ) తో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ రోలెక్స్ డాగ్ నార్కోటిక్ డ్రగ్స్ ను గుర్తించడంలో నైపుణ్యం కలిగినది.
గతంలో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ నందు ప్రతిభ చూపి నార్కోటిక్ విభాగంలో డాగ్ రోలెక్స్ బహుమతి పొందిన విషయం తెలిసిందే.