వాహనాల తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ రోలెక్స్

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ( Parliament Elections )లో భాగంగా అక్రమ డబ్బు,మద్యం, విలువైన వస్తువులు,డ్రగ్స్ లాంటి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా జిల్లా పోలీసు అంతరాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు( Integrated Check Posts ) ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ పటిష్టంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

దీనిలో భాగంగా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్( Suryapet Rural Police Station ) పరిధిలో జాతీయరహదారి 65 హైదరాబాద్- విజయవాడ హైవే పై టేకుమట్ల వద్ద అంతర్ జిల్లా సరిహద్దు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నిర్వహిస్తున్నారు.

డ్రగ్స్ నివారణలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా పోలీసు నార్కోటిక్ డాగ్ రోలెక్స్( Narcotic Dog Rolex ) తో వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ రోలెక్స్ డాగ్ నార్కోటిక్ డ్రగ్స్ ను గుర్తించడంలో నైపుణ్యం కలిగినది.గతంలో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ నందు ప్రతిభ చూపి నార్కోటిక్ విభాగంలో డాగ్ రోలెక్స్ బహుమతి పొందిన విషయం తెలిసిందే.

గోపీచంద్ మలినేని తర్వాత సినిమాను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?