టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి( Nara Lokesh Wife Nara Brahmani ) మంగళగిరిలో స్త్రీ శక్తి కార్యక్రమం( Stree Shakti Program )లో పాల్గొన్నారు.మంగళగిరి ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులేనని లోకేష్ తనతో అన్నట్లు తెలిపారు.
దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా, నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారని అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నట్టు బ్రాహ్మణి స్పష్టం చేశారు.అందుకే గత ఐదేళ్లుగా మంగళగిరిలో లోకేష్ కష్టపడుతున్నారని అంకితభావంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా 29 సంక్షేమ పథకాలను ఇక్కడ కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్( Basavatarakam Indo American Cancer Hospital ) ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే అది కేవలం నారా లోకేష్ మద్దతే అని బ్రాహ్మణి తెలియజేయడం జరిగింది.తనకు అందించిన మద్దతునే మంగళగిరి నియోజకవర్గంలోని మహిళలందరికీ అందించాలని లోకేష్ భావిస్తున్నట్లు ఇదే ఆయన విజన్ అన్నట్లు స్పష్టం చేశారు.హెరిటేజ్ కంపెనీలో( Heritage Company ) తనతోపాటు నారా లోకేష్ కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ సమయంలో రాత్రి పగలు మహిళలు( Women ) కష్టపడి పాలు ఉత్పత్తి చేసి హెరిటేజ్ కంపెనీకి అందిస్తే.వారికి మంచి ఆదాయం దక్కేల చూసేవారమని పేర్కొన్నారు.
ఆదాయంతో పాటు వారి గ్రామాల్లో సమాజంలో వారి కమ్యూనిటీలో వారి విలువ చాలా పెరిగింది.అది చూసి తమకు చాలా సంతృప్తి అనిపించినట్లు చెప్పుకొచ్చారు.
ఈ రకంగానే మహిళలకు ఏం చేసినా ఆదాయం వచ్చేలా సానుకూలంగా లోకేష్( Nara Lokesh ) నిర్ణయాలు తీసుకుంటారని స్థానిక మహిళలతో బ్రాహ్మణి ముచ్చటించారు.నాడు తాము పొందిన సంతృప్తి కంటే “స్త్రీ శక్తి” పథకం ద్వారా మరింత ఎక్కువ సంతృప్తిని కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పథకం ద్వారా మంగళగిరి( Mangalagiri )లోని మహిళలు అందరూ తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే లోకేష్ విజన్ అని బ్రాహ్మణి స్పష్టం చేయడం జరిగింది.