టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల కాలంలో సినిమాల పై కంటే ఎక్కువగా రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections in AP ) ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.ఇకపోతే పవన్ సినిమాల విషయానికొస్తే.
పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు.పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ సినిమా పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ప్రభాస్ తో సాహో సినిమా చేసిన సుజిత్ ఇప్పుడు ఓజీ సినిమాకు( OG ) దర్శకత్వం వహిస్తున్నారు.సాహో సినిమా టాక్ ఎలా ఉన్న డార్లింగ్ అభిమానులకు కిక్ ఇచ్చింది.దాంతో ఇప్పుడు ఓజీ సినిమా పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా పై అంచనాలను మరింత పెంచాయి.ఈ సినిమాకు తమన్ సంగీతం( Taman music ) అందిస్తున్నారు.
గ్లింప్స్ కు తమన్ అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి.ఈ వీడియోలో మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.
దాంతో సోషల్ మీడియాలో అభిమానులు ఈ మ్యూజిక్ కు రకరకాల వీడియోలు చేస్తున్నారు.తాజాగా ఒక పవన్ అభిమాని ఈ మ్యూజిక్ తో ఓ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈవీడియోకు తమన్ రియాక్ట్ అయ్యాడు.పవన్ నడుచుకుంటూ వస్తుంటే వెనకాల బిల్డింగ్ బ్లాస్ట్ అయ్యేలా వీడియోను ఎడిట్ చేశారు.దీని పై తమన్ స్పందిస్తూ.ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అని అన్నారు దాంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.