మహబూబాబాద్ జిల్లా( Mahabubabad )లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో దంపతుల మృతదేహాలు లభ్యం అయ్యాయి.
మృతులు అనిల్, దేవి దంపతులుగా గుర్తించారు.బలవన్మరణానికి పాల్పడిన అనిల్, దేవీ మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి.
అయితే గత నెలలో తమ ఇద్దరు చిన్నారులను హత్య చేసిన అనిల్, దేవి దంపతులు( Anil,Devi Couple ) ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.