ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) ప్రస్తుతం రాష్త్రవ్యాప్తంగా బహిరంగ సభలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఒకే స్థానంపై దృష్టి పెట్టే అవకాశం లేదు.కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
కడప లోక్ సభ స్థానంలో వైసీపీనే గెలిచే అవకాశాలు ఉన్నా షర్మిలకు ధీటుగా బదులివ్వడం కోసం జగన్ భారతి( YS Bharathi Reddy )ని రంగంలోకి దించనున్నారని తెలుస్తోంది.భారతి ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ పాల్గొనలేదు.
భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం ఆమె గురించి కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.అయితే భారతి ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.2024 ఎన్నికలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలతొ ముందుకెళ్తారో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైఎస్ భారతి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే సంచలనాలు సృష్టించడం ఖాయమని నెటిజన్లు చెబుతున్నారు.భవిష్యత్తులో భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.పాలిటిక్స్ విషయంలో భారతి ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
వైఎస్ భారతి అద్భుతంగా మాట్లాడగలరని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
వైఎస్ విజయమ్మ( Ys Vijayamma ) ప్రస్తుతం తటస్థంగా ఉన్నారని తెలుస్తోంది.అటు షర్మిలకు కానీ ఇటు జగన్ కు కానీ మద్దతు ఇవ్వడం ద్వారా నష్టమే తప్ప లాభం ఉండదని ఆమె భావిస్తున్నారని భోగట్టా.ఏపీ రాజకీయాల్లో గెలుపు కోసం విశ్రాంతి లేకుండా అన్ని పార్టీలు కష్టపడుతుండగా ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయో చూడాల్సి ఉంది.
వైసీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలపై జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.వైసీపీ 2019 మ్యాజిక్ ను మాత్రం రిపీట్ చేసే ఛాన్స్ అయితే లేదని చెప్పవచ్చు.