రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి సమాజాన్ని మేల్కొల్పిన మహాత్మ జ్యోతిరావు పూలే( Mahatma Jyotirao Phule , ) కు భారతరత్న అవార్డు ప్రధానం చేయాలని దళిత సంఘం జిల్లా నాయకులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ సంఘసంస్కరణలకు పిత మహుడిగా నిలిచిన పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని నిమ్న కులాలు మహిళల హక్కుల కోసం ఉద్యమించారని తెలిపారు .
విద్య ప్రాముఖ్యతను పూలే ఆనాడే గుర్తించారని ఆనాటి సమాజంలో విద్యకు నోచుకోని బాలికలను చేరదీసి వారికి విద్యాభ్యాసం చేసి బాధ్యతలను ఆయన భార్య సావిత్రిబాయికి( Savitribai Phule ) అప్పజెప్పారని గుర్తు చేశారు .దళితుల్లో అంటరానితనానికి గురవుతున్న మహర్లు మాతంగి కులస్తులకు బాలికల కోసం పాఠశాలలు నిర్వహించాలని వితంతు వివాహాన్ని ప్రోత్సహించారని చెప్పారు బ్రాహ్మణ వాదానికి మూఢభక్తికి వ్యతిరేకంగా పూలే పోరాడార ని బానిసత్వం రైతులకు అధికారం పై విమర్శనాత్మక గ్రంథాలను రచించారని తెలిపారు.నిమ్నకులాలపై అగ్రకుల ఆధిపత్యాన్ని దాడులను తన రచనల్లో ప్రస్తావించి విగ్రహారాధనకు మూడ భక్తికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని రగింలిచారని పేర్కొన్నారు.జ్యోతిరావు పూలే ఇచ్చిన స్ఫూర్తి దేశంలో ఆ తర్వాత అనేకమంది సంఘసంస్కర్తలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
అటువంటి మహాత్మ పూలేను భారతరత్న అవార్డుతో సత్కరించడం ఎంతో అవసరమని ఎడపల్లి బాబు ( Edapally Babu )పేర్కొన్నారు.