రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండలం మల్యాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పదవ తరగతి పాఠశాల 2004 -2005 సంవత్సరపు పూర్వ విద్యార్థులు తోటి విద్యార్థి వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించి సేవాభావం ప్రకటించారుమల్యాల పూర్వ విద్యార్థులు తోటి స్నేహితురాలైన దమ్మ మమత ( Damma Mamatha )(34)కుఒక బాబు (4) ఉన్నారు.
మమత అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న విషయం తెలుసుకొని పూర్వ విద్యార్థులు అందరు కలిసి దమ్మ మమత పడుతున్న ఇబ్బందిని పూర్తిగా తెలుసుకొని బ్రేస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న స్నేహితురాలు మమత కు పూర్వ విద్యార్థులు తరఫున లక్షా 32 వేల 516 రూపాయలు ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు.
దయ హృదయులైన దాతలు ఎవరైన దమ్మ మమతకు సహకారం అందించాలని కోరారు.ఫోన్ పే, జి ఫే ఫోన్ నెంబర్ లతో 7569693046,9701199010 ఆర్థిక సహాయం అందించాలని కోరారు.