యూఎస్ వీసా ఇంటర్వ్యూలో భారతీయుడికి వింత అనుభవం..

ఇండియన్ ఫిట్‌నెస్, న్యూట్రిషన్ ట్రాకింగ్ కంపెనీ అయిన అల్ట్రాహ్యూమన్( Ultrahuman ) ఇటీవల ఒక స్మార్ట్ రింగ్‌ను( Smart Ring ) మార్కెట్‌లో రిలీజ్ చేసింది.ఈ రింగ్ చాలా ఖరీదైనది.దీని ధర రూ.29,000 కంటే ఎక్కువ! డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫాం ఇండియాగోల్డ్ వ్యవస్థాపకుడు దీపక్ అబాట్( Deepak Abbot ) ఈ రింగ్ కొనుగోలు చేశాడు.ఇటీవల దీనిని ధరించి యూఎస్ వీసా ఇంటర్వ్యూకి( US Visa Interview ) వెళ్ళాడు.అయితే, వీసా కార్యాలయంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించరు.దీంతో అతను చాలా ఇబ్బంది పడ్డాడు.దానిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలో కూడా అతడికి తెలియ రాలేదు.

 Man Hid His Smart Ring Under A Rock Before His Us Visa Interview Details, Ultrah-TeluguStop.com

చివరికి వీసా కార్యాలయానికి కొన్ని గజాల దూరంలో ఒక రంధ్రం తవ్వాడు.ఆ రంధ్రంలో తన రింగ్‌ను పెట్టి, ఒక రాయితో గుర్తు పెట్టాడు.ఇంటర్వ్యూ ముగిసిన తరువాత, తిరిగి వెళ్లి ఆ రింగ్‌ను తీసుకున్నాడు.యూఎస్ వీసా ఇంటర్వ్యూకి వెళ్లేవారు ఎటువంటి ఎలక్ట్రానిక్స్( Electronics ) తీసుకువెళ్లవద్దని దీపక్ సలహా ఇస్తున్నాడు.

దీని గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేశాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో నాలుగు లక్షలకు పైగా అవిస్తూ బాగా వైరల్ అయింది.

వీసా కార్యాలయంలో వ్యక్తిగత వస్తువులను నిల్వ చేయడానికి సౌకర్యాలు లేకపోవడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.లాకర్లు లేదా సేఫ్ లొకేషన్లు ఎందుకు అందుబాటులో లేవని కొందరు ప్రశ్నించారు.

ఢిల్లీలో, కాన్సులేట్‌లో లాకర్లు అందుబాటులో ఉన్నాయని మరొకరు పేర్కొన్నారు.లాకర్ సదుపాయాన్ని( Locker Facility ) తొలగించిన ఢిల్లీలో ఇలాంటి పరిస్థితిని తాము ఎలా ఎదుర్కొన్నామో వివరిస్తూ మరొకరు వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు.ఇక అల్ట్రాహ్యూమన్ రింగ్ ఎయిర్ విషయానికొస్తే, దాని ముఖ్య లక్షణాలలో స్కిన్ టెంపరేచర్, హృదయ స్పందన వేరియబిలిటీ (HRV), కదలిక, నిద్ర నమూనాలు, నిరంతర హృదయ స్పందన రేటు (HR) ట్రాకింగ్‌ను పర్యవేక్షించడం ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube