గ‌ర్భిణీలు బ్రోకలీ తినొచ్చా..? తిన‌కూడ‌దా..? ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

మామూలు స‌మ‌యంతో పోలిస్తే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స్త్రీలు అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ఎన్నో నియ‌మాల‌ను పాటించాలి.

 Can Pregnant Women Eat Broccoli? Broccoli, Women, Pregnant Women, Pregnant, Wome-TeluguStop.com

ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో ఎంతో శ్ర‌ద్ధ వ‌హించాలి.ఎందుకంటే, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తీసుకునే ఫుడ్ త‌ల్లితో పాటు క‌డుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని కూడా ప్ర‌భావితం చేస్తుంది.

అందుకే గ‌ర్భిణీల‌ను పోష‌కాహారాన్ని డైట్‌లో చేర్చుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.అయితే గ‌ర్భిణీ స్త్రీల‌కు మేలు చేసే ఆహారాల్లో బ్రోకలీ ఒక‌టి.

కానీ, చాలా మంది గ‌ర్భిణీల్లో బ్రోకలీని తినొచ్చా.? తిన‌కూడ‌దా.? అన్న సందేహాలు ఉంటాయి.నిశ్చింత‌గా తినొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

పైగా గ‌ర్భిణీ స్త్రీలు బ్రోక‌లీని తిన‌డం వ‌ల్ల బోలెడ‌న్ని ఆరోగ్య ల‌భాలు ల‌భిస్తాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ లాభాలు ఏంటో చూసేయండి.సాధార‌ణంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో కొంద‌రు మ‌హిళ‌లు మ‌ధుమేహానికి గ‌ర‌వుతుంటారు.అయితే బ్రోకలీని డైట్‌లో చేర్చుకుంటే.అందులో ప‌లు పోష‌కాలు బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచి డయాబెటిస్ వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గిస్తాయి.

Telugu Broccoli, Tips, Latest, Pregnant-Telugu Health - తెలుగు హ�

గ‌ర్భిణీలు బ్రోకలీని తిన‌డం వ‌ల్ల క‌డుపులోని బిడ్డ ఎదుగుద‌ల మ‌రింత మెరుగ్గా మారుతుంది.అలాగే గ‌ర్భిణీ స్త్రీల‌ను ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య ర‌క్త‌హీన‌త‌.దీనిని నివారించేందుకు బ్రోక‌లీ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అవును బ్రోక‌లీని తీసుకుంటే ఎర్ర ర‌క్త క‌ణాలు వృద్ధి చెంది ర‌క్త హీన‌త ప‌రార్ అవుతుంది.

అంతే కాదు, బ్రోక‌లీని ఆహారంలో భాగంగా చేసుకుంటే గ‌ర్భిణీల్లో రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుంది.

కంటి ఆరోగ్యం రెట్టింపు అవుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారి మ‌ల‌బ‌ద్ధ‌కం, గ్యాస్‌, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఇక ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మ‌హిళ‌లు చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతుంటారు.అయితే బ్రోక‌లీని తింటే.

అందులోని ప‌లు విట‌మిన్లు మ‌రియు ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి విముక్తిని క‌లిగిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube