ట్రాఫిక్ సిగ్నల్ సరిచేసి వాహనదారుల ప్రాణాలను కాపాడిన డెలివరీ బాయ్..

చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద ప్రమాదాలను నివారించగలవు.పౌర బాధ్యత మనందరికీ ఉంది.

 The Delivery Boy Who Fixed The Traffic Signal And Saved The Lives Of Motorists,-TeluguStop.com

కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి సమాజానికి సేవ చేయాలి.తాజాగా ఒకటి డెలివరీ బాయ్ ఇతరుల కోసం ఒక మంచి పని చేసి సోషల్ మీడియాలో చాలామంది ప్రశంసలను అందుకుంటున్నాడు.

జీషన్ అహ్మద్ ఇర్షాద్ అహ్మద్ అనే ఈ డెలివరీ మ్యాన్ దుబాయ్‌( Dubai )లో ట్రాఫిక్ సిగ్నల్ సరిచేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాడు.అతను ఈ సమయంలో ధైర్యం, పౌర బాధ్యతను చాటాడు.

అసలేం జరిగిందంటే.జీషన్ తన బైక్‌పై వెళ్తుండగా, అల్ వాస్ల్ స్ట్రీట్‌లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ ప్రమాదకరంగా వేలాడుతున్నట్లు చూశాడు.ఎవరూ పట్టించుకోకపోవడంతో, జీషన్( Zeeshan ) స్వయంగా చర్యలు తీసుకున్నాడు.బైక్ దిగి, ట్రాఫిక్ సిగ్నల్‌ను సరిచేసి, ప్రమాదం జరగకుండా అడ్డుకున్నాడు.ఒక బాటసారి జీషన్ ధైర్యసాహసాన్ని చూసి, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.వీడియో వైరల్ కావడంతో, రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ( RT A) జీషన్‌ను గుర్తించి సన్మానించింది.

జీషన్‌ను RTA ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి, ప్రశంసా పత్రంతో సత్కరించారు.జీషన్ పాకిస్తాన్‌కు చెందినవాడు.

దాదాపు పదేళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నాడు.

జీషన్ చర్యలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.అతని నైతికత, పౌర బాధ్యతను అందరూ ప్రశంసించారు.“అటువంటి చర్యలు అభివృద్ధి చెందుతున్న సమాజానికి చాలా అవసరం.” అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కామెంట్ చేశాడు.మరొకరు “ప్రపంచంలో జీషన్ లాంటి వ్యక్తులు చాలా అరుదు.సమాజం పట్ల బాధ్యత చాలా ముఖ్యమైనది.” అని వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube