సినిమాకి అయినా హీరోకి తగ్గ హీరోయిన్ ఉంటేనే ఆ సినిమా బాగా ముందుకెళుతుంది.లేదా హీరోయిన్ కూడా తన స్టాండర్డ్ లో ఉన్న హీరో తోనే నటించాలి అనుకుంటుంది.
అప్పుడే తన పాపులారిటీ కూడా పెరుగుతుంది అని భావిస్తుంది.కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )లో వస్తున్న ఒరవడి చూస్తే ఆ పద్ధతికి నీళ్లు వదిలినట్టే కనిపిస్తోంది.
ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా తమ స్థాయి కన్నా కిందకి దిగివచ్చి చిన్న హీరోలతో నటించడానికి సై అంటున్నారు.మరి ఇలా ఆ చిన్న హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని ఫిక్స్ అయిపోయిన ఆ హీరోయిన్స్ ఎవరు ? ఆ సినిమాలు ఏంటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కీర్తి సురేష్( Keerthy Suresh ) :
ఇటీవల కీర్తి సురేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరో ఆయన సుహాస్ పక్కన ఉప్పుకప్పురంబు( Uppu Kappurambu ) లో నటించడానికి ఓకే చెప్పింది అన్న విషయం బయటకు రాగానే సోషల్ మీడియా భగ్గుమంది.కీర్తి సురేష్ లాంటి సినిమా ఎందుకు చేస్తుంది ఎవరికి అర్థం కాలేదు ఆమె ఇలా చేయడం ఇదేమీ మొదట చిత్రం కాదు, ఇంతకు ముందు నవీన్ చంద్ర సరసన అలాగే అరవింద్ కృష్ణ అనే ఒక చిన్న నటుడు సరసన కూడా కనిపించింది.ఇక మొన్నటికి మొన్న బోలాశంకర్ లో సుశాంత్ పక్కన కూడా నటించింది.
రష్మిక మందన( Rashmika Mandanna ) :
రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఆమెకు పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేనట్టుగా కనిపిస్తుంది.ఆమె ఇప్పుడు రెయిన్ బో( Rainbow ) అనే సినిమాలో ఫిమేల్ లీడ్ సెంట్రిక్ రోల్ లో కనిపిస్తుండగా ఇందులో దేవ్( Dev ) అనే ఒక మలయాళ చిన్న హీరో నటిస్తున్నాడు.ఈ హీరో ఇంతకు ముందులో తెలుగులో శాకుంతలం సినిమాలో నటించాడు.
సమంత( Samantha ) :
సమంత చాలా రోజులుగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ వస్తుండగా మొన్నటికి మొన్న శకుంతల సినిమాలో మలయాళ హీరో దేవ్( Malayalam Hero Dev Mohan ) సరసన నటించగా, ఆమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ బాగానే చిన్న హీరోలను ఎంకరేజ్ చేస్తుంది.
అనుష్క శెట్టి( Anushka Shetty ) :
అనుష్క సినిమాలు తీయడం చాలా తగ్గించిన గత చిత్రం నవీన్ పోలిశెట్టితో చేయడం విశేషం.మీస్ పోలిశెట్టి మిస్టర్ శెట్టి అనే సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన నవీన్ హీరోగా నటించాడు.అనుష్కతో పోలిస్తే నవీన్( Naveen Polishetty ) చిన్న హీరోనే కదా.అది మాత్రమే కాదు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్న అనుష్క ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు అనే చిన్న హీరోతో నటిస్తోంది.