ప్రస్తుతం సోషల్ మీడియా( Social media ) ప్రపంచం నడుస్తోంది.ప్రపంచంలో ఏ విషయానికి సంబంధించి అయినా సమాచారం ఇట్టే తెలుసుకోవచ్చు.
ఇకపోతే ప్రతి రోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉంటాం.ఇందులో బాగుందని కొన్ని వీడియోలు ఎంటర్టైర్మెంట్ ఇస్తుండగా మరికొన్ని వీడియో ఆలోచించే విధంగా ఉంటాయి.
ఇందుకు సంబంధిచి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.
తాజాగా ఓ వ్యక్తి కుటుంబంతో సరదాగా గడుపుదామని షాపింగ్ మాల్( Shopping mall ) కు వెళ్ళాడు.అలా వెళ్లిన ఆ కుటుంబానికి శోకం మిగిలింది.ఆ తండ్రి చేతుల్లోంచి పొరపాటున జారిపడి వారి ఏడాదిన్నర బిడ్డ కన్నుమూసింది.ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
మాల్ లో ఎస్కులేటర్ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి తన చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు.
అదే సమయానికి ఆ వ్యక్తి ఐదేళ్ల కొడుకు ముందుకు వెళ్తుండడం గమనించి బాబును నిలువరించేందుకు ఆ తండ్రి ప్రయత్నించాడు.ఐటీజే పొరపాటున ఈ లోపు చేతిలో ఉన్న ఏడాదిన్నర బిడ్డ తన చేతుల నుండి జారి కింద పడిపోయింది.ఆ బిడ్డ మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో కాస్త తీవ్ర గాయాలయ్యాయి.
సంఘటన జరిగిన వెంటనే బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లగా.అప్పటికే సదరు చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
ఇక ఆ మాల్ సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.నిజానికి ఈ వీడియోలోని దృశ్యాలు మానలన్నీ కలవరపర్చొచ్చు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఏ విషాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో ను మీరు కూడా చూసేయండి.