Rana Balakrishna : బాలయ్య రికార్డులను బద్దలు కొట్టబోతున్న రానా.. ఏం చేయబోతున్నారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు దగ్గుబాటి రానా( Rana ) ఒకరు.ఈయన లీడర్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు.

 Rana Host New Talk Show Details Goes Viral-TeluguStop.com

కేవలం సినిమాలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన తేజ డైరెక్షన్లో రాక్షస రాజా ( Rakshasa Raja ) అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే రానా నటుడిగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా మంచి గుర్తింపు పొందారు గతంలో ఈయన పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే  మరోసారి కూడా రానా యాంకర్ గా మారి సరికొత్త షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.రానా పాన్ ఇండియా స్థాయిలో ది రానా కనెక్షన్ ( The Rana Connection ) అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.ఈ టాక్ షోని అమెజాన్ ప్రైమ్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది.

ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు వచ్చిన అవి కేవలం ఆ భాష వరకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ మొదటిసారి రానా పాన్ ఇండియా స్థాయిలో ఒక షో హోస్ట్ చేయబోతున్నారు.

ప్రస్తుతం ఉన్న టాక్ షోల్లో కాఫీ విత్ కరణ్,  అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే వంటి షోలు ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకొని రికార్డులను సృష్టించాయి.ఇప్పుడు బాలయ్య ( Balayya ) రికార్డులను బ్రేక్ చేసేందుకు రానా సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.మరి ఈ కార్యక్రమం ద్వారా కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా నార్త్ సౌత్ సెలెబ్రిటీలు అందరిని కూడా ఈ వేదికపైకి తీసుకురాబోతున్నారని తెలుస్తుంది .మరి ఈ షో ఎప్పుడు ప్రారంభం కాబోతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube