లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో బీజేపీ( BJp ) ప్రచారంలో వేగం పెంచింది.ఇందులో భాగంగా తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) రానున్నారు.
పది రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి మోదీ వస్తున్నారు.దాదాపు మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న మోదీ సాయంత్రం 5 గంటలకు మల్కాజ్ గిరి పార్లమెంట్( Malkajgiri ) పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు.ఈ క్రమంలో మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు మోదీ రోడ్ షో కొనసాగనుంది.ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.