తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఆయన ఒకపక్క పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే, మరోపక్క సినిమాలు చేస్తూ బిజీ గా మారిపోతున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ అంటే నచ్చని హీరోలుగానీ, ప్రేక్షకులు గాని ఉండరు ఆయన సినిమాల ద్వారా ఆయనకు కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆయన వ్యక్తిత్వంతో ఆయనకి అభిమానులు గా మారిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు.ఇక ఇదిలా ఉంటే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ధనుష్ , విజయ్, విక్రమ్, విశాల్ లాంటి స్టార్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే విషయం చాలా మందికి తెలియదు.

కాని వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పడం విశేషం… ఇక బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ హీరో అయిన అమీర్ ఖాన్ కూడా తను పవన్ కళ్యాణ్ అభిమాని అనే విషయం తనే స్వయంగా ఇక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.ఇక చాలామంది హీరోలను తన ఫ్యాన్ గా మార్చుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.అందుకే పవన్ కళ్యాణ్ అందరిలో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోగా చరిత్రలో నిలిచాడు.ఇతను ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకుండానే హీరోలు అందరిని తన అభిమానులుగా మార్చుకున్నాడు.

అంటే తన స్టైల్ గాని తన మేనరిజం కానీ ఒక సినిమా పట్ల తను పెట్టిన ఎఫార్ట్స్ గాని ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఇది ఇలా ఉంటే ఆయన దగ్గర పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్స్ లో బిజీగా ఉండడం వల్ల సినిమా షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చాడు.ఎలక్షన్ ముగిసిన వెంటనే సినిమాల్లో బిజీగా మారబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు…
.