తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వర రావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత శివ అనే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే ఈయన చేసిన వరుస సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లుగా నిలవడమే కాకుండా ప్రస్తుతం కింగ్ నాగార్జున( Nagarjuna ) తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.
అయితే ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండేలా చూసుకుంటూ వస్తూ ఉంటాడు.

ఇక ఇదిలా ఉంటే ఈపీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున చేసిన హలో బ్రదర్ సినిమా( Hello Brother )లో సౌందర్య, రమ్యకృష్ణ ఇద్దరు హీరోయిన్లుగా నటించారు.ఇక అందులో రమ్యకృష్ణ ఈ సినిమాలో కొంచెం మాస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.అయితే ఒకానొక రోజు రమ్యకృష్ణ( Ramya Krishna ) కి, నాగార్జునకి మధ్య షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ స్పాట్ లో చిన్న మిస్ అండర్ స్టాండింగ్ జరగడం వల్ల రమ్యకృష్ణ కి నాగార్జున మీద కోపం వచ్చి ఆయన మీద అరిచిందట.
దాంతో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగిందట.ఇక దాంతో షూటింగ్ సెట్ నుంచి బయటకు వచ్చేసిన రమ్యకృష్ణ కొద్దిసేపటి దాకా షూటింగ్ లో పాల్గొనలేదు.

ఇక ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ గారు జరిగిన మ్యాటరెంటో తెలుసుకొని ఇద్దరు మధ్య వచ్చిన చిన్న క్లాశేష్ ఏంటంటే డైలాగ్ ప్రాక్టీస్ లో డైలాగ్స్ ఒకరి తర్వాత ఒకరు చెప్తుంటే, ఇద్దరు నువ్వు ఇలా చెప్పాలి, నువ్వు అలా చెప్పాలని అరుచుకొని తలో మాట అనుకున్నారంట.ఇక ఆ విషయాన్ని తెలుసుకున్న ఇవివి గారు వాళ్ళిద్దర్నీ కాంప్రమైజ్ చేసి మళ్లీ ఇద్దరి మధ్య మాటలు కలిపి సినిమా షూటింగ్ ను ముందుకు తీసుకెళ్లారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి…
.