కొమురం భీం జిల్లా ( Komuram Bheem District ) సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ( Sirpur Ex MLA Koneru Konappa ) కాంగ్రెస్ పార్టీ ( Congress Party) లో చేరేందుకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు ఈ నెల 14వ తేదీన ఆయన హస్తంగూటికి చేరనున్నారు.
కాగజ్ నగర్ మండలం ఈజ్ గాం ఆలయ సమీపంలో భారీ బహిరంగ సభ ( Public Meeting )ను ఏర్పాటు చేయనున్న కోనేరు కోనప్ప… ఆ సభా వేదికగా రాష్ట్ర మంత్రుల ( State Ministers ) సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారని సమాచారం.అయితే బీఆర్ఎస్ తో బీఎస్పీ పార్టీ పొత్తు (Alliance)ను కోనేరు కోనప్ప ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ ( Congress Party )లో చేరుతున్నారని తెలుస్తోంది.