తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం( National Dam Safety Authority team ) మరోసారి రంగంలోకి దిగింది.ఈ మేరకు ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలన చేయనుంది.
పరిశీలన అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం సీపేజీలపై నివేదిక ఇవ్వనుంది.కాగా రాత్రికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకోనుంది.
రేపు, ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను అధికారులు పరిశీలించనున్నారు.తరువాత ఈనెల 9న ఇంజినీర్ అధికారులతో పాటు నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు.