టాలీవుడ్ సినిమాలలో దేశభక్తి సినిమాలకు సంబంధించి లిస్ట్ తీస్తే మొదటి మూడు సినిమాలలో ఖడ్గం సినిమా( Khadgam ) కూడా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ( Director Krishna Vamsi ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తర్వాత ఓ డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.
ప్రతి విషయంలో దేశభక్తికి అద్దం పట్టేలా డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాను తెరకెక్కించారు.ఇందులో ముఖ్యంగా మతాల మధ్య అంతరాయం తగ్గించి దేశభక్తి పెంపొందించేలా అనేక అంశాలు చూపించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది
ఈ సినిమాలో సీనియర్ హీరోలు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ లు ప్రధాన పాత్రలలో నటించారు.ఇక హీరోయిన్లుగా సోనాలి బింద్రే, సంగీత లాంటి నటీమణులు నటించి మెప్పించారు.సినిమా మొదలయ్యే రోజులలో మొదటగా సంగీత కి బదులుగా సీనియర్ హీరోయిన్ తీసుకుందామని మొదటగా కృష్ణవంశీ భావించారు.
ఇంతకీ సంగీత చేసిన రోల్ ను రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు… ‘సాక్షి శివానంద్'( Sakshi Shivanand ). ఈవిడ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి మొదటగా కృష్ణవంశీ సాక్షి శివానంద్ ను సంగీత( Sangeetha ) నటించిన రోల్ చేయమని అడగగా ఆమె ఆ పాత్ర అయితే చేయనని., సోనాలి బింద్రే( Sonali Bindre ) క్యారెక్టర్ అయితే చేస్తానని తెలిపిందట.
అయితే డైరెక్టర్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ క్యారెక్టర్ అయితే అవసరం లేదని చెప్పి సంగీతను ఇంట్రడ్యూస్ చేశారు.దీంతో సంగీత ఆ సినిమాకు హీరోయిన్ సంగీత నటనపరంగా సినిమా విమర్శకులను కూడా మెప్పించింది.
ఇంకేముంది ఈ సినిమా తర్వాత సంగీత హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు ముందుకు సాగింది.సంగీత తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.ఇందులో భాగంగా కుర్ర హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలలో( Mother Roles ) నటిస్తూ తన గుర్తింపును కొనసాగించుకుంటుంది.తాజాగా మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు'( Sarileru Nekevvaru ) సినిమాలో హీరోయిన్ రష్మిక తల్లిగా నటించి మెప్పించింది.