సాధారణంగా విజయ్( Vijay ) సినిమాలో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు.అయితే తమిళంలో ఇప్పుడిప్పుడే గుర్తింపును సొంతం చేసుకుంటున్న ఇవానా మాత్రం విజయ్ మూవీకి నో చెప్పారట.
ఇలా ఇవానా ( Ivana ) నో చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఉందని సమాచారం అందుతోంది.విజయ్ కు చెల్లిగా నటించాలని కోరడంతో ఆమె సున్నితంగా ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
విజయ్ వెంకట్ ప్రభు( Venkat Prabhu ) కాంబినేషన్ లో ఒక సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.
తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి టైమ్ ట్రావెల్ చేసి కొడుకు ఏం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఇవానాకు విజయ్ సినిమాలో నటించాలని ఆసక్తి ఉన్నా విజయ్ కు చెల్లిగా నటించడం వల్ల మూవీ ఆఫర్లు తగ్గే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇవానా రిజెక్ట్ చేసిన రోల్ లో మోడల్, నటి అభియుక్త నటించనున్నారని తెలుస్తోంది.విజయ్ రెండు సినిమాలలో నటించి సినిమాలకు గుడ్ బై చెబుతానని సంచలన ప్రకటన చేశారు.

విజయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో చివరి రెండు సినిమాలు సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని అభిమానులు భావిస్తున్నారు.విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పడంతో లియో2 సినిమా( Leo2 movie ) సెట్స్ పైకి వెళ్లడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.విజయ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో విజయ్ కూడా ఒకరని సమాచారం అందుతోంది.