Chalo Delhi : మరోసారి ఢిల్లీ ఛలోకి సిద్ధమవుతున్న రైతులు..!!

ఢిల్లీ సరిహద్దు( Delhi Border ) ప్రాంతాల్లో గత తొమ్మిది రోజులు పడిగాపులు కాస్తున్న రైతన్నలు మరోసారి ఛలో ఢిల్లీకి సిద్ధం అవుతున్నారు.ఈ మేరకు శంభు సరిహద్దు( Shambu Border ) నుంచి ట్రాక్టర్లతో ర్యాలీగా ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

 Farmers Protest Samyukta Kisan Morcha Calls For Agitation Against Bjp Mps-TeluguStop.com

ఈ క్రమంలో శంభు సరిహద్దుల్లో 14 వేల మందికి పైగా రైతులు ఉన్నారు.రైతుల ఢిల్లీ చలో నేపథ్యంలో పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించారు.

భారీ కంచెలతో రాజధాని సరిహద్దులను పోలీసులు మూసివేశారు.

దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే ఎంఎస్పీపై ప్రధాని మోదీ( PM Narendra Modi ) ప్రకటన చేస్తేనే నిరసన విరమిస్తామని రైతులు చెబుతున్నారు.మరోవైపు రైతులతో మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించొద్దని ఆదేశాలు జారీ చేసింది.

కాగా సంయుక్తి కిసాన్ మోర్చా( Samyukt Kisan Morcha ), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో సుమారు రెండువందల రైతు సంఘాలు ఢిల్లీ ఛలోకు పిలుపునిచ్చాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube