కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు.వీటిని డార్క్ సర్కిల్స్( Dark Circles ) అని కూడా అంటాము.
డార్క్ సర్కిల్స్ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలో సర్వసాధారణం.నిద్రలేమి, వేళకు నిద్రపోకపోవడం, హైపర్ పిగ్మెంటేషన్, సూర్యరశ్మికి అతిగా బహిర్గతం అవ్వడం, ఐరన్ లోపం, థైరాయిడ్, ధూమపానం తదితర కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.
ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.అందాన్ని పాడు చేస్తాయి.
ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా చాలా సులభంగా డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచురల్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut oil )వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మరియు రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.దాదాపు 5 నిమిషాల పాటు కలిపితే మన క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.
ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా కనుక చేశారంటే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.ఈ న్యాచురల్ క్రీమ్ కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను క్రమంగా దూరం చేస్తుంది.
అలాగే ఈ క్రీమ్ ను వాడటం తో పాటు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోండి.ధూమపానం అలవాటు మానుకోండి.మరియు కొంతమంది మేకప్ తోనే నిద్రపోతుంటారు.
ఈ అలవాటును కచ్చితంగా వదులుకోండి.