Sai Dharam Tej : ఇది నాకు రెండో జన్మ… ప్రమాద ఘటనను మర్చిపోలేకపోతున్న మెగా హీరో?

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ఒకరు.వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి ధరమ్ తేజ్ గతంలో రోడ్డు ప్రమాదానికి ( Road Accident ) గురైన సంగతి మనకు తెలిసిందే.

 Sai Dharam Tej Remember His Road Accident Incident-TeluguStop.com

ఇలా బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి ఈయన కోమాలోకి కూడా వెళ్లారు.ఈ ప్రమాదం తర్వాత దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈయన తిరిగి విరూపాక్ష ( Virupaksha ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Telugu Helmet, Road, Roadsafety, Sai Dharam Tej, Tollywood, Virupaksha-Movie

ఇలా ప్రమాదం తర్వాత బయటపడినటువంటి ఈయన ఎక్కడ మాట్లాడిన అభిమానులను జాగ్రత్త వహించమని బైక్ పై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్( Helmet ) తప్పనిసరి కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి అంటూ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.తాజాగా జాతీయ రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్‌) ఆధ్వ‌ర్యంలో బంజ‌రా హిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేష‌న‌ల్ సోసైటీ ఆడిటోరియంలో ర‌హ‌దారి భ‌ద్ర‌తా చైత‌న్య స‌ద‌స్సు( Road Safety Awareness Drive ) నిర్వ‌హించారు.


Telugu Helmet, Road, Roadsafety, Sai Dharam Tej, Tollywood, Virupaksha-Movie

ఈ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే కారులో వెళ్లే వాళ్ళు సీట్ బెల్ట్( Seat Belt ) పెట్టుకోవాలని మద్యం తాగి ఎవరు బండి నడపొద్దని ఈయన తెలిపారు.అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించమని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఈయన అభిమానులను కోరారు.ఇక తాను కూడా ఈ ప్రమాదాన్ని ఫేస్ చేశానని అయితే మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను తిరిగి పునర్జన్మ పొందానని ఇది నాకు రెండో జన్మ అంటూ ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube