Rajanna Sircilla : ఆస్తి పన్ను 100శాతం వసూలు చేయాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) సిరిసిల్ల బల్దియా పరిధిలో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.సిరిసిల్ల బల్దియాకు చెందిన అద్దె గదులు, స్టేడియం, కొత్త చెరువు బండ్ అండ్ పార్క్ తదితర అంశాలఫై సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం మున్సిపల్, స్పోర్ట్స్, విద్యాశాఖ అధికారులతో చర్చించారు.

 100percent Taxes Should Collect Says Collector Anurag Jayanthi-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సిరిసిల్ల మున్సిపల్ నిధులతో నిర్మించిన అద్దె గదులు ఖాళీగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మొత్తం ఎన్ని అద్దె గదులు ఖాళీగా ఉన్నాయో అడిగి తెల్సుకున్నారు.సిరిసిల్ల పాత, కొత్త బస్ స్టాండ్లు, మార్కెట్ ఏరియాలో మొత్తం 86 ఖాళీగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్( Collector Anurag Jayanthi ) దృష్టికి తీసుకురాగా, అవి ఖాళీగా ఎందుకు ఉన్నాయని, వాటిని త్వరగా అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు.

జిమ్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పెద్ద పెద్ద దుకాణాలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.వినియోగదారుల అవసరాలకు అనుగుణగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేయాలని వివరించారు.

ఆయా గదులు బేస్ ధరకే ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు.సిరిసిల్ల లో ఇప్పటిదాకా ఇంటి పన్ను, నల్ల బిల్లులఫై అడుగగా, ఇంటి పన్ను 69 శాతం, నల్ల బిల్లులు 49 శాతం వసూలు చేశామని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వచ్చే నెలలోగా 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

భారీగా ఇంటి పన్ను, నల్ల బిల్లులు బకాయి ఉన్న వారితో సమావేశం ఏర్పాటు చేయాలని, వాటిని తప్పనిసరిగా వసూలు చేయాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్ లు( Trade Licenses ) నిబంధనల మేరకు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.

మినీ స్టేడియంను సద్వినియోగం చేసుకోనేలా చూడాలి.అనంతరం స్టేడియంలో నిర్వహించనున్న వాలీబాల్ ట్రోపి ఏర్పాట్లు, పోటీలకు ఇప్పటి వరకు ఎన్ని టీంలు పేర్లు నమోదు చేసుకున్నాయని డీవైఎస్ఓ రాందాస్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.8 టీమ్ లు మాత్రమే నమోదు చేసుకున్నాయని , ఎంట్రీ ఫీజ్ వల్ల కొన్ని టీమ్ లు వాలీబాల్ పోటీలకు ముందుకు రావడం లేదన్నారు.ఎంట్రీ ఫీజు లేకుండా నమోదు కు అవకాశం ఇవ్వాలన్నారు.

స్టేడియంలో స్కేటింగ్ ట్రాక్, క్రికెట్ నెట్లో బౌలింగ్ మిషన్ ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని, ప్రణాళికలు సిద్దం చేయాలని వివరించారు.అలాగే వివిధ ఆటలు స్టేడియంలో ప్రాక్టీసు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని  తెలిపారు.

మినీ స్టేడియం( Mini Stadium )ను ఉపయోగింకునేలా విద్యార్థులు, యువత ను ప్రోత్సహించడం తో పాటు నిర్ణీత రుసుం వారి నుండి వసూలు చేయాలని సూచించారు.మినీ స్టేడియంను ఉపయోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఇప్పటి దాకా దాదాపు 620 మంది 8,9 మంది విద్యార్థులను గుర్తించామని వారి నుండి ఏడాది కాలానికి వినియోగ చార్జీల కింద నామ మాత్రపు రుసుం రూ.100 చొప్పున వారం రోజుల్లోగా వసూలు చేస్తామని చెప్పారు.ఇంకా ఉత్సాహం ఉన్నయువత, విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోనేలా చూడాలన్నారు.

మినీ స్టేడియంలో వివిధ ప్రైవేట్ ఈవెంట్ల నిర్వహణకు ఇప్పుడు ఉన్న రుసుం పెంచాలని పేర్కొన్నారు.అనంతరం సిరిసిల్లలోని కొత్త చెరువు బండ్ అండ్ పార్క్ నిర్వహణఫై అడిగి తెలుసుకున్నారు.

దాని నిర్వహణ ప్రైవేటు వారికి అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించామని అధికారులు తెలుపగా, పార్క్ నిర్వహణలో మంచి అనుభవం ఉన్నవారిని ఎంపిక చేయాలని  కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, డీఈఓ రమేశ్ కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ ఆయాజ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారి, డీవైఎస్ఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube