మామూలుగా ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి మామూలుగా ఉండదు.చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు చాలా వరకు సినిమాలు శుక్రవారం ఎక్కువగా విడుదల అవుతూ ఉంటాయి.
ఇక నేడు కూడా రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.అందులో రవితేజ( Ravi Teja ) హీరోగా నటించిన ఈగల్ సినిమా ( Eagle movie )పేరే ఎక్కువగా వినిపిస్తోంది.
అలాగే మరో సినిమా తమిళ హీరో రజనీకాంత్ నటించిన లాల్ సలామ్( Lal Salaam ).రెండు సినిమాలు రెండు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి.అయితే నిజం చెప్పాలంటే నేడు ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న మాటే కానీ, కొంచెం కూడా బజ్ లేదు.

కనీసం రవితేజ ఈగల్ రిలీజ్ అవుతుంది అన్న విషయమైనా తెలుసు కానీ, అసలు రజినీకాంత్ ( Rajinikanth )సినిమా రేపు రిలీజ్ అవుతుందన్న విషయమే చాలామంది ప్రేక్షకులకు అస్సలు తెలియదు.అయితే మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతికి రావాల్సి ఉండగా సోలో రిలీజ్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ మాట ఇవ్వడంతో వెనక్కి తగ్గాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఫిల్మ్ ఛాంబర్ ఫిబ్రవరి 9 న ఈగల్ కు ఇచ్చింది.
ఇక డబ్బింగ్ సినిమాగా లాల్ సలాం రిలీజ్ అవుతుంది.ఎంత డబ్బింగ్ అన్నా కూడా రజిని సినిమా అంటే వుండే ఊపు, హైప్ ఏది ఈ సినిమాకు లేదు.

మూవీ మేకర్స్ సైతం తమిళ్ లో చేసినంత ప్రమోషన్స్ తెలుగులో చేయలేదు.ఇక బుకింగ్స్ లో రవితేజ రజిని ఓవర్ టేక్ చేశాడు.లాల్ సలాం కన్నా ఈగల్ ఎక్కువ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది.ఇక రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటే మునుపెన్నడూ చూడని ఊర మాస్ అవతార్ లో రవితేజ కనిపిస్తున్నాడు.
ఈ సినిమాపై రవితేజ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ఇక లాల్ సలాం లో రజిని మొయిద్దీన్ భాయ్ గా కనిపించనున్నాడు.రజినీ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు దర్శకత్వం రజిని కూతురు సౌందర్య కావడం విశేషం.
మరి రెండు సినిమాలలో ఏ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి.