తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు,( BRS MLC’s ) పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు నల్ల కండువాలు వేసుకొని వచ్చారు.ఈ క్రమంలో నల్ల కండువాలు వేసుకొని సభలోకి రావొద్దంటూ మార్షల్స్ వారిని అడ్డుకున్నారు.
అయితే నిరసన తెలపడం తమ హక్కు అంటూ ఎమ్మెల్సీలు సభలోకి వెళ్లారు.కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు సవాల్ విసిరారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, పోలీసులకు( Police ) మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.