TDP Bjp :ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం

ఏపీ రాజకీయాలు బాగా హీటెక్కాయి.ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో పొత్తులు, ఎత్తులు , సీట్ల సర్దుబాటుతో పాటు , ప్రజలను ఆకట్టుకునే విధంగా  ఏపీలోని రాజకీయ పార్టీల అధినేతలు బిజీబిజీగా మారిపోయారు .

 Tdp Bjp :ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం  కావడం తో పూర్తిగా ఈ వ్యవహారాలపైనే దృష్టి పెట్టాయి.  ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు టిడిపి,  జనసేనలతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్రం హోంమంత్రి అమిత్ షా ( Amit Shah )తో మంతనాలు చేశారు.

ఇక ఎన్డీఏలో చేరేందుకు టిడిపి అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు.బిజెపితో పొత్తులో భాగంగా ఆ పార్టీ కోరినన్ని అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలను కేటాయించేందుకు సిద్ధం అయిపోయారు .

Telugu Amith Shah, Ap Cm Jagan, Chandrababu, Delhi, Jagan, Janasena, Janasenani,

ఇక తమతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను  చంద్రబాబు ఢిల్లీకి పిలిపెంచారు.ఇప్పటికే ఏపీలో బిజెపి , జనసేన లు అధికారికంగా పొత్తు కొనసాగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబు ఢిల్లీలోనే ఉండగా,  ఈరోజు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీకి వెళ్ళనున్నారు.  ఏపీ ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోది,  అమిత్ షా తో జగన్ భేటీ కానున్నట్లు వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

చంద్రబాబు , పవన్ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో బిజెపి పెద్దలతో మంతనాలు  చేసేందుకు ఢిల్లీకి వెళ్ళడం ఆసక్తికరంగా మారింది.

Telugu Amith Shah, Ap Cm Jagan, Chandrababu, Delhi, Jagan, Janasena, Janasenani,

ఏపీ ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తున్నారని ,నేరుగా ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) ని,  కేంద్ర హోమం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు , నిధుల కోసం జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లుగా చెబుతున్నా,  ఢిల్లీలో ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయం బిజెపి అధినేతలు తీసుకోబోతున్న నేపథ్యంలో జగన్ వారితో భేటీ కాబోతుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube