రాజన్న సిరిసిల్ల జిల్లా: కార్వింగ్ కళాకారుడు జాతీయ అవార్డు గ్రహీత శ్యామంతుల అనిల్ ను జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో స్థానిక జడ్పిటిసి కార్యాలయంలో సోమవారం శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ కార్వింగ్ కళాకారుడు, రిపోర్టర్ శ్యామంతుల అనిల్ గుమ్మడికాయ తో రామ మందిరం తయారు చేసిందానికి ఆదివారం రోజు హనుమకొండలో యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వారు విశిష్ట స్ఫూర్తి చిత్రకళా రత్న అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషకరమని,
అదేవిధంగా మునుముందు మన మండలానికి అవార్డులు దక్కించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, జిల్లా సీనియర్ నాయకులు అందే సుభాష్, వైస్ ఎంపీపీ కదిర భాస్కర్, కాంతారావు, సుధాకర్ రావు, గుండాడి వెంకట్ రెడ్డి, పిల్లి కిషన్,నాగరాజు, కొమురయ్య తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతను అభినందించారు.