భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో( Illandu Municipality ) మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం వీగిపోయింది.మొత్తం 24 మంది సభ్యుల్లో 15 మంది సభ్యులే హాజరు అయ్యారు.
ఈ క్రమంలో అవిశ్వాసం వీగిపోయిందని అధికారులు ప్రకటించారు.అయితే మున్సిపల్ ఛైర్మన్( Municipal Chairman ) పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాలక వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.
అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసేందుకు 17 మంది కౌన్సిలర్లు వచ్చారని సమాచారం.
అయితే వీరిలో కౌన్సిలర్ నాగేశ్వర్ రావు( Councilor Nageshwar Rao ) ను ఎమ్మెల్యే కోరం కనకయ్య( MLA Koram Kanakaiah ) బలవంతంగా తీసుకెళ్లారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు.అలాగే సీపీఐ కౌన్సిలర్ ను కూడా ఆ పార్టీ నేతలు తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు.ఇద్దరు కౌన్సిలర్లను తీసుకెళ్లడంపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడింది.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 24 మంది కౌన్సిలర్లలో 17 మంది మద్ధతు తప్పనిసరి.కానీ 15 మంది మాత్రమే ఉండటంతో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం వీగిపోయింది.