Bhadradri : వీగిన భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపల్ అవిశ్వాస తీర్మానం..!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో( Illandu Municipality ) మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం వీగిపోయింది.

మొత్తం 24 మంది సభ్యుల్లో 15 మంది సభ్యులే హాజరు అయ్యారు.ఈ క్రమంలో అవిశ్వాసం వీగిపోయిందని అధికారులు ప్రకటించారు.

అయితే మున్సిపల్ ఛైర్మన్( Municipal Chairman ) పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాలక వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.

అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసేందుకు 17 మంది కౌన్సిలర్లు వచ్చారని సమాచారం. """/" / అయితే వీరిలో కౌన్సిలర్ నాగేశ్వర్ రావు( Councilor Nageshwar Rao ) ను ఎమ్మెల్యే కోరం కనకయ్య( MLA Koram Kanakaiah ) బలవంతంగా తీసుకెళ్లారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు.

అలాగే సీపీఐ కౌన్సిలర్ ను కూడా ఆ పార్టీ నేతలు తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు.

ఇద్దరు కౌన్సిలర్లను తీసుకెళ్లడంపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడింది.అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 24 మంది కౌన్సిలర్లలో 17 మంది మద్ధతు తప్పనిసరి.

కానీ 15 మంది మాత్రమే ఉండటంతో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం వీగిపోయింది.

కౌసల్య తనయ రాఘవ మూవీ రివ్యూ!