మామూలుగా సెలబ్రిటీలు( Celebrities ) సినిమాలు, యాడ్లు ఈవెంట్లు అంటూ భారీగా సంపాదిస్తూ ఉంటారు.అంతే కాకుండా సెలబ్రిటీలు ధరించే చెప్పుల నుంచి వాచ్ ల వరకు ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
కోట్లు విలువ చేసే కార్లను ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే లక్షలు విలువ చేసే దుస్తులను ఆభరణాలను కూడా ధరిస్తూ ఉంటారు.
ఇక సెలబ్రిటీల పిల్లలకు అయితే ఎటువంటి లోటు ఉండదు అని చెప్పవచ్చు.పిల్లల అదృష్టవంతులు అని తల్లిదండ్రులు ఏది అడిగినా కొనిస్తారు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు.
కానీ మీకు తెలుసా కొంతమంది సెలబ్రిటీలు కోట్ల డబ్బులు ఉన్నప్పటికీ పిల్లలను చాలా జాగ్రత్తగా మంచి విలువలతో పెంచుతున్నారట.ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.యాంకర్ సుమ కనకాల( Anchor Suma Kanakala ) ఆమె భర్త రాజీవ్ కనకాల ఇద్దరు కూడా ఇండస్ట్రీకి చెందిన వారే అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇద్దరు కలిసి ఇప్పటికీ కోట్లల్లో సంపాదించారు.
కానీ సుమా కనకాల మాత్రం ఇప్పటికి తన పిల్లలకు ఎంత అవసరమైతే అంత డబ్బులు మాత్రమే ఇస్తుందట అతిగా ఖర్చు పెట్టడానికి అసలు ఇవ్వదట.
స్టార్ హీరో అయిన గోపీచంద్( Hero Gopichand ) కోట్లు ఉన్నప్పటికీ తన పిల్లలను స్పెషల్ గా కారులో పంపించకుండా అందరి పిల్లలతో సమానంగా స్కూల్ బస్సులోనే పంపిస్తాడట.
అల్లు అర్జున్ తన కూతురు అల్లు అర్హ( Allu Arha ) కి పట్టుబట్టి తెలుగులో నేర్పిస్తున్నారట.అందుకు సంబంధించిన వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.అంతేకాకుండా పెళ్లి తర్వాత ఇంట్లో బూతులు మాట్లాడడమే మానేశారట హీరో అల్లు అర్జున్.ఈ విధంగా కోట్లు ఉన్నప్పటికీ పిల్లలకు మంచి మంచి విలువలను నేర్పుతున్నారు సెలబ్రిటీలు.