రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ బ్యూటీ అరియానా( Bigg Boss beauty Ariyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇక రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో పలు షోలకు యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్, బికినీ ఫోటో షూట్ ( Hot photoshoot, bikini photo shoot )లు గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని నెగటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక అభిమానికి దిమ్మతిరిగే విధంగా ఆన్సర్ ఇచ్చింది అరియానా.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె అభిమానులతో ముచ్చటించింది.
ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్.నువ్వు నా భాగస్వామి అవ్వాలని చేతబడి చేస్తున్నా అని చెప్పాడు.ఏంటి బ్రో.నిజంగానా? అసలు నిన్ను బ్రో అని పిలవాలనే ఉద్దేశం, ఫీలింగ్ లేనేలేదు.కానీ నువ్వు చేతబడి చేస్తున్నా అని అన్నావ్ కాబట్టి అలా పిలిచా.నువ్వు చేతబడి చేస్తే నీకు నేను మందు పెడతా అంటూ ఫన్నీగా స్పందించింది అరియానా.
మొన్నటి వరకు బుల్లితెరపై హంగామా చేస్తూ ఉన్న అరియానా ఈ మధ్యకాలంలో బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆమె జాబ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.