పూరీ జగన్నాథ్( Puri Jagannath ) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి మంచి లాభాలను సొంతం చేసుకున్నాయి.ఒకప్పుడు కేవలం 12 కోట్ల రూపాయల బడ్జెట్ తో పోకిరి సినిమాను తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ ఈ సినిమాతో ఏకంగా 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించారు.
అయితే గత కొంతకాలంగా పూరీ జగన్నాథ్ కు సరైన బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం లేదు.చాలామంది పోకిరి( Pokiri ) హ్యాంగోవర్ లో ఉండి పూరీ జగన్నాథ్ ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ కామెంట్ల గురించి పూరీ జగన్నాథ్ ఒక సందర్భంలో స్పందిస్తూ నేను దేశముదురు, బుజ్జిగాడు కథలకు పోకిరితో సంబంధం ఉండదని నేను నా రాక్షసి( Nenu Naa Rakshasi )కి పోకిరి పోలికలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.ఇలా కామెంట్లు చేసే అభిమానులు పోకిరి ఫీవర్ నుంచి బయటకు రావాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
పూరీ జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉండగా రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని రామ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
రామ్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
డబుల్ ఇస్మార్ట్( Double iSmart ) కు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఒకింత భారీ బడ్జెట్ తో డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది.డబుల్ ఇస్మార్ట్ మూవీ పూరీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.
ఈ సినిమాలో రామ్( Ram Pothineni ) సరికొత్త లుక్ లో కనిపించనున్నారని భోగట్టా.