చెరకు పంటను( Sugarcane harvest ఆశించి తీవ్ర నష్టం కలిగించే మసి బూజు తెగులు వివిధ రకాల కీటకాలు, గాలి ద్వారా వ్యాపిస్తుంది.తెగులు సోకిన చెరుకు కాడలను విత్తనాలుగా పొలంలో నాటడం తెగుల వ్యాప్తికి మరొక సాధనం.
వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం పరిస్థితులు ఈ తెగుల వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి.
ఈ తెగులను ఎలా గుర్తించాలంటే.
చెరుకు మొక్క ఎదుగుతున్న ప్రదేశంలో నల్లని కొరడా లాంటి ఒక నిర్మాణం ఉద్భవిస్తే.ఆ మొక్కకు తెగుళ్లు సోకినట్టే.
అంగస్ యొక్క బీజాంశం ఈ కొరడా యొక్క కణజాలంలో నిల్వ చేయబడి ఉంటుంది.దీంతో మొక్క ఎదుగుదల తగ్గిపోయి ఆకులు సన్నగా గట్టిగా మారతాయి.
చెరుకు పంట నాణ్యత చాలావరకు దెబ్బతింటుంది.
తెగులు లేని తెగులు నిరోధక విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.పంట మార్పిడి చేస్తేనే తెగుళ్లు పంటను ఆశించకుండా, ఒకవేళ ఆశిస్తే తెగుళ్ల వ్యాప్తి ఎక్కువగా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది.హీట్ థెరపీను ఉపయోగిస్తే.
వివిధ తెగుళ్లు చెరుకు మొక్కలను ఆశించడానికి వీలు ఉండదు.హీట్ థెరపీ( Heat therapy ) అంటే.
వేడిగాలి, తేమ చికిత్స చేయడం.వేడి నీటి చికిత్స 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద రెండు గంటలు నీటిలో ముంచి, ఆ తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ఈ తెగులు సోకిన తర్వాత పూర్తిస్థాయిలో అరికట్టే పిచికారి మందులు అందుబాటులో లేవు కాబట్టి బెంజిమిడాజోల్ ( Benzimidazole )లాంటి శిలీంద్ర నాశకాలతో శుద్ధి చేసి నట్లయితే తెగులు ఆశించిన వ్యాప్తి జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.ఇక తెగులు పంటను ఆశించిన తర్వాత Bilstar top, Amistar top లలో ఏదో ఒక పిచికారి మందులు ఉపయోగించి తెగుల వ్యాప్తిని ఆపవచ్చు.