క్యాప్సికం( Capsicum ), మిరప పంటలను ఆశించే ఫుట్, కాలర్ రాట్ ఫంగస్ మట్టిలో ఉండే మొక్కల అవశేషాల వ్యర్ధాలలో జీవించి ఉంటుంది.అనుకూల పరిస్థితులలో ఈ ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.
ఈ ఫంగస్ వ్యాప్తి నేల పిహెచ్ విలువ తక్కువగా ఉన్న, తరచూ వర్షాలు కురవడం, మొక్కలు దగ్గరగా నాటడం, అధిక ఉష్ణోగ్రత ఉంటే శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.ఈ ఫంగస్ మొక్క యొక్క కాండానికి సోకుతుంది.
మొక్క కణజాలంపై లేదంటే మొక్క చుట్టుపక్కల ఉండే భూమిపై గుండ్రటి-టాన్ గోధుమ రంగులో తెల్లని మెత్తని శిలింద్రపు చాపలా ఏర్పడి వేగంగా వ్యాప్తి చెంది పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
ఈ ఫంగస్( Fungus ) పంటలను ఆశించకుండా ఉండాలంటే.తెగులు నిరోధక కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.కచ్చితంగా మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
ఈ పంటలను కాస్త ఆలస్యంగా వేయడం వల్ల ఈ ఫంగస్ భారి నుండి పంటను సంరక్షించుకోవచ్చు.నీటి తడులు రాత్రి సమయాలలో కాకుండా కేవలం పగటి సమయాలలో మాత్రమే పంటకు అందించాలి.
ఫంగస్ లక్షణాలు కనిపించిన మొక్కలను వెంటనే పీకేసి కాల్చి నాశనం చేయాలి.
సేంద్రీయ పద్ధతి( Organic method )లో ఈ ఫంగస్ ను వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చు కానీ పూర్తిగా నివారించడం మాత్రం అసాధ్యమే. ట్రైకోడెర్మా హర్జియం( Trichoderma harzeum ), బాసిల్లస్ సబ్లిటిస్, గ్లైకోక్లాజియం వైరన్స్ లను ఉపయోగించాలి.రసాయన పద్ధతుల్లో ఈ ఫంగస్ ను నివారించే పద్ధతులు ప్రస్తుతం అందుబాటులో లేవు.
ఏవైనా రసాయన పిచ్చికారి మందులు ఉపయోగించిన ఆశించిన స్థాయిలో ఫలితం దక్కదు కాబట్టి ఈ ఫంగస్ పంటను ఆశించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయడం వల్ల ఈ ఫంగస్ పూర్తిగా నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువ.