ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ మూవీ ఫస్ట్ వీకెండ్ వరకు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో కలెక్షన్లను సాధించగా వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి.ఇప్పటివరకు 600 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోగా ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు 700 కోట్ల రూపాయల దగ్గర ఆగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి.
సినిమాలోని సూరీడే పాట ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే సూరీడే సాంగ్ ( Salaar Movie Sooreedu Song )హిందీ వెర్షన్ పాడిన సింగర్ మేనుకా పౌదేల్ పుట్టుకతో బ్లైండ్ కాగా చూపు లేకపోయినా తన టాలెంట్ తో ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇండియన్ ఐడల్ సీజన్14 ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న మేనుకా పౌదేల్ ను గతంలో స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఎంతో ప్రశంసించారు.
బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు ఛాన్స్ ఇవ్వకపోయినా పశాంత్ నీల్ ( Prashant neel )మాత్రం ఆమెకు అవకాశం ఇచ్చి మంచి మనస్సును చాటుకున్నారు.ఈ సాంగ్ హిందీ వెర్షన్ కు 5.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.మేనుకా టాలెంట్ ను చూసి ఛాన్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.రాబోయే రోజుల్లో మేనుకాకు మరిన్ని ఆఫర్లు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
మౌనుకా పౌదేల్ వాయిస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మౌనుక పౌదేల్( Menuka poudel )కు మరి కొందరు టాలీవుడ్ డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తే ఆమె కెరీర్ కు ప్రయోజనం చేకూరుతుంది.చూపు లేకపోయినా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ప్రశంసలు పొందే స్థాయికి చేరుకున్న మౌనుకా పౌదేలా సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పవచ్చు.